Thursday, 11 January 2018

Tuesday, 2 January 2018

ముడుచుకుపోయే బిచాణం, మంగళాన్ని వెతికె నయనం..
మంచుని చీల్చే రవికిరణం, చల్లగా వీచే పవనం..
నీలినింగి వెనుక నక్షత్రాలు దాక్కునె తరుణం, ఆంజనేయుడు ఆందుకునే అర్చనం..
సుప్రభాత శ్రవణం, సస్యశామలమైన వనం..
చిన్నారి బుగ్గలపై అమ్మ పెదవుల ముద్రణం, సాగరంలో ఆగని గోదారి మీలనం...
నాన్నమ్మ చేసుకునే పారాయణం, కోకిల పలుకులకు ఆహ్వనం...
హిమాలయాల నుండి గంగ రింగణం, చిలుకలు తిరుగు గగనం...
నిత్యం మనతో మనకే రణం, ఆందరికి మంచి జరగాలని మనసులో మననం...
వర్ణించమని వెంటాడె వర్ణo, ఎప్పటికి పురతనమవ్వని కొత్త కోణపు కవనం..
ఓ సూర్యోదయం...
Shra1 kumar
Fb: shravan kumar valdas

https://youtu.be/ NuvrZxPhWWs